
“నిండు జీవితానికి 2 చుక్కలు” అనే నినాదంతో మాచర్ల టౌన్‌లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్, మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమెర దుర్గారావు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, టీడీపీ సీనియర్ నాయకులు మద్దిగపు వెంకట్రామిరెడ్డి, యూనిట్ ఇన్‌చార్జి శివశంకర్ నాయక్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.
ఈ సందర్భంగా ప్రజలు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, వారి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని నాయకులు సూచించారు.
