
మాచర్ల: 12వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల టౌన్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర-2026 కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరమని పేర్కొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని అన్నారు. నేటి ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను ఆచరిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొంటూ యువత, మహిళలు, వృద్ధులు అందరూ యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, యోగా శిక్షకులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
