
మాచర్ల: మొహరం పండుగతో పాటు నెలాఖరు చివరి ఆదివారం నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులకు బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు అసిస్టెంట్ అకౌంట్ అధికారి జి. చంద్రశేఖర్ తెలిపారు.
మాచర్ల, గురజాల విద్యుత్ కార్యాలయాల్లో బిల్లు చెల్లింపు కౌంటర్లు సాధారణంగా పనిచేయనున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక బిల్లు వసూళ్ల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాత, కొత్త బకాయిలను సకాలంలో చెల్లించాలని, తద్వారా విద్యుత్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు.
