
ఈ సందర్భంగా యూనిట్ హెడ్ శ్రీ వి. వెంకట రమణ మాట్లాడుతూ, ప్రతిరోజూ కనీసం గంటసేపు యోగ చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.
ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ తెనాలి రాజు మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం కోసం KCP యాజమాన్యం ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, ధ్యాన మందిరం, జిమ్ వంటి సదుపాయాలను అభినందించారు. కాలనీలోని పరిశుభ్రమైన వాతావరణం, సమర్థవంతమైన హౌస్కీపింగ్ నిర్వహణ, ఉద్యోగుల మధ్య ఉన్న ఐక్యత ప్రశంసనీయమని పేర్కొన్నారు. యోగను నిత్యజీవితంలో భాగంగా చేసుకుంటే ఆలోచనా విధానంలో సానుకూల మార్పులు వస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో HR హెడ్ శ్రీ కె. ఉదయ్ కుమార్, వివిధ విభాగాల హెచ్వోడీలు, యూనియన్ ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, సమస్థితి మహిళా మండలి కోఆర్డినేటర్ శ్రీమతి వి. సుశీలతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.
