
పి. సాయి శ్రీని 593 మార్కులు సాధించి అత్యుత్తమ ఫలితం సాధించగా, తాండవ సుశాంక్ 591 మార్కులు, గొట్టం ధనంజయ రెడ్డి మరియు శ్రీరామ్ భరద్వాజ్ తలా 589 మార్కులు సాధించారు. 580కి పైగా మార్కులు 9 మంది విద్యార్థులు, 570కి పైగా మార్కులు 11 మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
