
పల్నాడు జిల్లాలో మరోసారి సీఐ చిన్న మల్లయ్య పేరు వివాదంలోకి వచ్చింది. తనను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ధనలక్ష్మి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినుకొండ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. గతంలో వినుకొండ సీఐగా పనిచేసిన చిన్న మల్లయ్య, అప్పట్లో తనకు పరిచయం అయ్యాడని బాధితురాలు తెలిపింది.
బ్రాహ్మణపల్లి వద్ద తన ఇంటికి వచ్చి బలవంతంగా అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. అనంతరం చిన్న మల్లయ్యను గదిలో బంధించి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇటీవలే కారంపూడిలో టీడీపీ నేతను గన్‌తో బెదిరించిన వివాదంలో చిన్న మల్లయ్య పేరు వినిపించింది. ఆ ఘటన తర్వాత ఉన్నతాధికారులు ఇప్పటికే ఆయనను వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే.
ఈ తాజా ఆరోపణలతో సీఐ చిన్న మల్లయ్యపై మరింత వివాదం నెలకొంది.
