
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం లోయపల్లి గ్రామంలో పిడుగు పడటంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీ మండ్లి నాసరయ్యకు చెందిన పూరి గుడిసెపై పిడుగు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలు వేగంగా వ్యాపించడంతో గుడిసె పూర్తిగా కాలిపోయింది. సంఘటన సమయంలో గుడిసెలో ఎవరూ నివాసం ఉండకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
అయితే గుడిసెలో ఉన్న సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
