Author: myapnews9@gmail.com

పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు గురజాల రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని దీపావళి మందుల (ఫైర్‌వర్క్స్) దుకాణాలపై అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలను మాచర్ల తహసీల్దార్, అర్బన్ సీఐ, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కలిసి చేపట్టారు. తనిఖీలలో భాగంగా దుకాణదారుల వద్ద లైసెన్స్‌లు, వాటి వాలిడిటీ, స్టాక్ వివరాలు, సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు తదితర భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని దుకాణదారులకు అధికారులు ఆదేశించారు.

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాచర్ల పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సమన్వయకర్త బుసా రామాంజనేయులు మరియు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి హరి పులి హాజరయ్యారు. వారు జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మదీన్ లాల్, కృష్ణ గౌడ్, వినోద్, సాంబశివరావు, కృష్ణ బాబు, ఫారక్, నరసింహా, అమరయ్య, సాయి, రాజేషు, వెంకటరమణ, అబ్బాసు తదితర జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Read More

పల్నాడు జిల్లా మాచవరం మండలం మొర్జంపాడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.దాచేపల్లి సిఐ భాస్కరరావు ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులతో గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో కొన్ని మారణాయుధాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలు పరిరక్షణ కోసమే ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.అదేవిధంగా గ్రామస్తులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.

Read More

పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని మాచర్ల రోడ్డులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేద కుటుంబానికి బియ్యం పంపిణీ చేశారు.జనసేన పార్టీ నాయకుడు పాలపోగు బాబు ఆధ్వర్యంలో జనసైనికులు కలిసి కడియం అనిల్ అనే పేద కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పాలపోగు బాబు మాట్లాడుతూ… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పేదలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి జనసైనికుడు ముందుకు వచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.జనసేన పార్టీ అంటే ప్రజలకు సేవ చేసే పార్టీ అని, ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా వాటి పరిష్కారానికి జనసేన ముందుంటుందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు అభినందిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పగిడి కోటయ్య, మేకల రాజేష్…

Read More

మాచర్ల నియోజకవర్గంలోని సిరిగిరిపాడు గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రైతుల తరఫున వశెనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పీఎం కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల ఆదినారాయణ, మాచర్ల పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్, రూరల్ అధ్యక్షుడు సన్నాయిల బ్రహ్మం, వడ్లమూడి వెంకయ్య, ఏటుకూరి స్వామి, అమృత లింగేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షులు మారం వంశీకృష్ణ, గోపవరపు నీరజ్ తదితరులు పాల్గొన్నారు

Read More

వినుకొండ:పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వినుకొండ పట్టణం 19వ వార్డు కౌన్సిలర్ ఎంఎస్‌కే భాష ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, పట్టణ నాయకులు పాల్గొని ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును వడ్డించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More

పల్నాడు జిల్లానరసరావుపేటలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి10 మంది అరెస్ట్ – రూ.23,300 నగదు స్వాధీనంపట్టణంలోని శ్రీరాంపురం ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిపై నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల వద్ద నుంచి రూ.23,300 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఫిరోజ్ తెలిపారు.జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఫిరోజ్ హెచ్చరించారు. 🚨

Read More

అన్నదాతల ఉన్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని శిరిగిరిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ అనుబంధ స్టాల్స్, ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలు, చిరుధాన్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 38,926 మంది రైతులకు రూ.21 కోట్లు 89 లక్షల 32 వేల విలువైన నగదు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రైతులకు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి ప్రాధాన్యత ఇస్తూ, అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు…

Read More

దుర్గి: మెయింటెనెన్స్ పనుల కారణంగా శనివారం దుర్గి మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ జి. సీతారాం తెలిపారు.మండలంలోని ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, దుర్గి పట్టణంలో మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు.రెండవ శనివారం సందర్భంగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లు మరియు 11 కేవీ లైన్లలో మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాచర్ల డీఈ రామయ్య ఆదేశాల మేరకు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు

Read More

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 నెలల్లో ఎన్నికలు జరగొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించడంతో పాటు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కూటమి విజయమే సాధించిందని, రాబోయే ఎన్నికల్లో కూడా గెలుపు కూటమిదే కావాలని చెప్పారు.అదేవిధంగా గ్యాస్ కొరత రాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎలక్ట్రిక్ స్టవ్‌ల వినియోగం పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున దానిపై కూడా నిఘా ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Read More