Author: myapnews9@gmail.com

పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జున రావు ముస్లిం సోదరులకు హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల రోజులపాటు కఠిన నియమాలతో ఉపవాస దీక్షలు పాటిస్తూ, శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరుల ఆత్మీయత, భక్తి భావం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.రంజాన్ పండుగ మనకు ప్రేమ, కరుణ, పరస్పర గౌరవం వంటి విలువలను గుర్తు చేస్తుందని తెలిపారు. మతాలు వేరైనా మనసులు ఒక్కటిగా ఉండాలని, సమాజంలో ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని కోరుతూ “ఈద్ ముబారక్” తెలిపారు.మాచర్ల ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండే సాంప్రదాయం కొనసాగాలని, ప్రజల మధ్య సోదరభావం పెంపొందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి…

Read More

పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు మాచర్ల పట్టణంలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మాచర్ల పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.135 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచినట్లు తెలిపారు. రానున్న సంవత్సరం కాలంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రూ.40 కోట్లతో మాచర్ల-రెంటచింతల పట్టణాలకు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ క్వారీ పరిసర ప్రాంతాలు, మార్కెట్ యార్డ్ సమీపంలో షాపులు నిర్మించి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. గతంలో టెడ్కో ఇళ్ల కోసం పేర్లు నమోదు చేసుకున్న వారు మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి తమ వివరాలు తెలుసుకోవాలని కోరారు.గత 20 సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్న ఆయన, ఎమ్మెల్యేగా ప్రజలు…

Read More

మాచర్ల పట్టణంలోని నూర్ మసీద్, మర్కస్ మసీద్‌లలో నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు కూడా హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నెలరోజులపాటు నిష్టతో ఉపవాస దీక్షలు ఆచరించి పేదలకు సహాయం చేయడం ముస్లింల గొప్ప సంప్రదాయమని అన్నారు. రంజాన్ నెల సౌహార్ద్రం, సహనానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించడంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం పెద్దలు, యువకులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయి అనంతరం బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఆయన నివాసంలో వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మానాయుడు పిన్నెల్లిని కలిసి ఆయన ఆరోగ్యం, పరిణామాలపై చర్చించారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Read More

మాచర్ల పట్టణ ఆర్యవైశ్య, యువజన, మహిళా సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం స్థానిక శ్రీ కోదండ రామాలయం దేవస్థానంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా గరిణె శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కూనిశెట్టి పుల్లారావు, కోశాధికారిగా యేచూరి అమర సురేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. యువజన సంఘం అధ్యక్షులుగా కొత్తూరి చందు, ప్రధాన కార్యదర్శిగా భవనాసి రవితేజ, కోశాధికారిగా షరాబు అనీల్‌కుమార్ ఎన్నికయ్యారు. మహిళా సంఘం అధ్యక్షురాలిగా సొలస కళ్యాణి, ప్రధాన కార్యదర్శిగా మారం రుక్మిణి, కోశాధికారిగా గోపవరపు భూలక్ష్మితో పాటు ఆయా సంఘాల కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read More

రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఎక్కడా రాజీపడబోమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను అభినందించారు.“జాబ్ ఫస్ట్” అనేది కూటమి ప్రభుత్వ ప్రధాన విధానమని పేర్కొన్న ఆయన, అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి సుమారు 6 లక్షలకుపైగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, కొత్త పరిశ్రమల స్థాపనతో యువతకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్, యువత పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు

Read More

ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రశాంత వాతావరణం అవసరమని ఎమ్మెల్యే జూలకంటి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో నెలకొన్న విభేదాలపై ఇరు వర్గాలను పార్టీలకు అతీతంగా పిలిపించి చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఐకమత్యంతో ఉండాలని, ఫ్యాక్షన్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ముఠా తగాదాల వల్ల గ్రామ అభివృద్ధి దెబ్బతింటుందని, వ్యక్తిగతంగా కూడా నష్టాలు కలుగుతాయని వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లను పునరావృతం చేయకుండా ముందుకు సాగాలని సూచిస్తూ, భవిష్యత్తులో ఫ్యాక్షన్ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే సూచనలు, సలహాలను స్వాగతించిన ఇరు వర్గాల నాయకులు పరస్పరం సమ్మతితో రాజీకి వచ్చారు. అనంతరం కలిసి గ్రూప్ ఫోటో దిగుతూ మిఠాయిలు పంచుకుని సఖ్యతను చాటుకున్నారు.ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ పొట్లపాటి చంద్రారెడ్డి, రెండవ సర్పంచ్ గోగుల చినపుల్లారెడ్డి, మాజీ సర్పంచ్ గోగుల వెంకటేష్ రెడ్డి,…

Read More

మాచర్ల పట్టణంలో ఉగాది పర్వదినం సందర్భంగా సాహిత్య సుగంధం వెదజల్లింది. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన “ఉగాది కవి సమ్మేళనం” శుక్రవారం పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ కవులు తమ కవిత్వంతో ఉగాది ప్రత్యేకతను ప్రతిబింబిస్తూ సభికులను అలరించారు.డాక్టర్ బెజ్జంకి జగన్నాథ చర్యలు, డాక్టర్ ముట్టుకుల కమలహాసన్, సాయి మార్కొండ రెడ్డి, కోడెల పూర్ణచంద్రరావు, గాదె రామకృష్ణరావు, ముప్పవరపు గాంధీ, ఈవీఎలఎన్ మూర్తి, దుబ్బలదాసుకవి, జూలకంటి పోలిరెడ్డి తదితరులు కవితా పఠనంతో ఆకట్టుకున్నారు. ఉగాది ఆత్మీయత, తెలుగు సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతతో పాటు సమాజంలోని మార్పులను కవులు తమ కవిత్వంలో విభిన్న కోణాల్లో వ్యక్తం చేశారు.ప్రతి కవి తనదైన శైలిలో కవితలను వినిపించగా, సభికులు చప్పట్లతో అభినందించారు. ఉగాది పచ్చడి, జీవన రుచులు, కాలచక్రం వంటి ప్రతీకలను కవిత్వంలో ప్రతిబింబిస్తూ పలువురు కవులు విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కవి సమ్మేళనం…

Read More

మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం రేగులవరంతండా గ్రామంలో శ్రీ మహాలక్ష్మమ్మ, సేవాలాల్ మహారాజ్ స్వామి వారి కీర్తి ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి పిన్నెల్లి రమా, ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో భక్తి, ఐక్యత, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. గ్రామాభివృద్ధి కేవలం మౌలిక సదుపాయాలతో మాత్రమే కాకుండా, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ముందుకు సాగాలి. శ్రీ మహాలక్ష్మమ్మ, సేవాలాల్ మహారాజ్ స్వామి వారి ఆశీస్సులతో గ్రామం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.

Read More

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిన్నెబొయిన రామసైదులు (16) అనే బాలుడు ప్రమాదవశాత్తు నాగులేరు వాగులో పడి మృతి చెందాడు.నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రామసైదులు, నేడు గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం ఆడుకుంటూ వెళ్లిన సమయంలో కాలు జారి వాగులో పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.కళ్లముందే ఆడుకుంటూ వెళ్లిన కుమారుడు ఇక తిరిగి రాడని తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు చూసి గ్రామస్తులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More