
వెల్దుర్తి: మాచర్ల పట్టణ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అమృత్ స్కీం కింద రూ.126 కోట్ల నిధులతో చేపట్టనున్న నూతన తాగునీటి పైప్‌లైన్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశించారు.
శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో గుంటూరు, నరసరావుపేట, మాచర్ల మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనుల పురోగతిపై చర్చించి, వేగవంతంగా పూర్తి చేయాలని పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారుల బృందం, గుత్తేదారు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
