
మాచర్ల పట్టణంలోని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సిద్ధా భత్తుని మురహరిరావు సతీమణి కల్పనా దేవి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమం నిర్వహించారు. మాచర్లలో ఉచిత విద్యను అందిస్తున్న సత్యసాయి విద్యా విహార్ అభివృద్ధి అవసరాల కోసం రూ.25 వేల విరాళాన్ని అందజేశారు.
ఈ విరాళాన్ని కెసిపి సీనియర్ జనరల్ మేనేజర్ వివి రమణ, ఉదయ్ కుమార్, రోటరీ క్లబ్ ప్రతినిధుల సమక్షంలో జక్కా శ్రీనివాసరావుకు అందించారు.
ఈ సందర్భంగా విద్యా సేవలకు చేయూతనందించిన డాక్టర్ మురహరిరావు – కల్పనా దేవి దంపతులను పలువురు అభినందించారు. సమాజంలో విద్యాభివృద్ధికి ఇటువంటి దాతృత్వ కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
