
ఈ తనిఖీల్లో ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలు సహా సుమారు 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ఎం. మహేశ్వరావు మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి కార్డన్ సెర్చ్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. అక్రమ కార్యకలాపాలు, ఐపీఎల్ బెట్టింగ్‌లు, నాటుసారా తయారీ, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరిన డీఎస్పీ, ప్రజల సహకారంతోనే ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కొనసాగుతుందని పేర్కొన్నారు.
