
ఈ సందర్భంగా పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోతో పాటు కొన్ని గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సీఐ తెలిపారు.
వాహనాలకు సంబంధించిన పత్రాలు, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని ప్రజలకు సూచించారు. అలాగే యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఒక సీఐ, ఐదుగురు ఎస్ఐలు, 35 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
