
మాచర్ల 24వ వార్డులో పారిశుద్ధ పనులు… ఎమ్మెల్యే ఆదేశాలతో చర్యలు వేగవంతం
మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 24వ వార్డులో పారిశుద్ధ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమెర దుర్గారావు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వేణు బాబు, డీఈ రాఘవ, వార్డు ఇన్‌చార్జి కోమటి వీరు తదితరులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. డ్రైనేజీ శుభ్రపరిచే పనులు, వ్యర్థాల తొలగింపు, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
మున్సిపల్ సిబ్బందితో కలిసి ప్రత్యక్షంగా పనులను నిర్వహింపజేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. స్థానిక సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
