
మాచర్ల: హనుమాన్ జయంతి సందర్భంగా మాచర్ల శ్రీశైలం రోడ్డులోని శ్రీ పెద్ద ఆంజనేయ స్వామి దేవస్థానంలో కొలువుదీరిన శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారిని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ అధికారులు, భక్తులు ఎమ్మెల్యే దంపతులను స్వాగతించి ఆశీర్వాదాలు అందించారు.
