
సాగర్ రోడ్‌పై వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి ముందుగా డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం రోడ్డుమధ్యలో ఉన్న విద్యుత్ స్థంభాన్ని బలంగా ఢీకొనడంతో నాగార్జునబాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
