
మాచర్లలో ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్ – రూ.3.40 లక్షలు, 8 మొబైళ్లు సీజ్
పల్నాడు జిల్లా ఎస్పీ, గురజాల డీఎస్పీ ఆదేశాల మేరకు మాచర్ల టౌన్ పోలీసుల దాడుల్లో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
మే 8వ తేదీ రాత్రి మాచర్ల రైల్వే స్టేషన్ రోడ్డులో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో, అనుమానాస్పదంగా కూర్చొని మొబైల్ ఫోన్లలో బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆటలు ఆడుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు.
పోలీసులు వారి మొబైల్ ఫోన్లను తనిఖీ చేయగా “రాడే ఎక్స్చేంజ్”, “నేషనల్ 77”, “ది టైగర్ 247” వంటి యాప్స్ ద్వారా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
అరెస్ట్ చేసిన వారిలో మారంరెడ్డి సురేష్ రెడ్డి, చుండూరు సుధాకర్, బొడ్డు అమరలింగయ్య, కోలా శ్రీధర్, పట్టాన్ జానీ, కందుల యేసు ఉన్నారు.
వారి వద్ద నుండి 8 సెల్ ఫోన్లు మరియు రూ.3,40,800 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా నిందితులకు రిమాండ్ విధించబడింది. అనంతరం సబ్ జైలుకు తరలించారు.
