
మండల కేంద్రం దుర్గిలో శ్రీ సాయి వెంకటేష్ పాలీ క్లినిక్ ప్రాక్టీషనర్ బండారు నాగరాజు ఆధ్వర్యంలో శుక్రవారం మంచి నీటి చలి వేంద్రాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ వడ్డే శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు మన ప్రాణాధారం అని, దాన్ని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వేసవి కాలంలో నీటి వినియోగంపై జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోట యోహాను, బ్యాంకు క్యాషియర్ షేక్ మజ్ను, క్లినిక్ సిబ్బంది, వై. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.
