
పల్నాడు జిల్లా – మాచర్ల నియోజకవర్గం
నేరచరిత్ర కలిగిన ముగ్గురికి జిల్లా బహిష్కరణ
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడెం గ్రామంలో నేరచరిత్ర కలిగిన ముగ్గురు వ్యక్తులపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న నేపథ్యంలో, వారికి జిల్లా బహిష్కరణ విధిస్తూ కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్లా, ఐఏఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం, పై ముగ్గురిని 6 నెలల పాటు పల్నాడు జిల్లా పరిధి నుండి బహిష్కరించారు.
బహిష్కరణకు గురైన వారు:
పంగా ఇద్దయ్య (28సం), తండ్రి: మల్లయ్య
పంగా అంజయ్య @ అంజి (54సం), తండ్రి: పెద్ద కాశయ్య
గన్నెబోయిన లక్ష్మయ్య (51సం), తండ్రి: గురవయ్య
(ముగ్గురూ యాదవ కులానికి చెందిన వారు, కొత్తపుల్లారెడ్డిగూడెం గ్రామం, వెల్దుర్తి మండలం)
వీరిపై ఒక్కొక్కరికి మూడు నుండి నాలుగు వరకు వివిధ నేర కేసులు నమోదై ఉన్నాయి.
🔹 మార్చి 7వ తేదీన గ్రామంలో బయటపడిన మారణాయుధాల కేసు, అలాగే 2020లో గన్నేబోయిన గంగిరాజు హత్య కేసులో కూడా వీరి పేర్లు ఉన్నట్లు సమాచారం.
అదనంగా, వీరిపై రౌడీషీట్లు నమోదై ఉండటం గమనార్హం.
ప్రజల భద్రత దృష్ట్యా మరియు శాంతి భద్రతలు పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఇదే విధంగా కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
