
జయంతి నగర్‌లో ST కుటుంబాల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే జూలకంటి
మాచర్ల పట్టణంలోని జయంతి నగర్‌లో నివసిస్తున్న పలు ఎస్టీ కమ్యూనిటీ కుటుంబాలు ప్రాథమిక సౌకర్యాల కొరతతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిన వెంటనే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.
ఈ ప్రాంతంలో ఇప్పటివరకు సరైన సీసీ రోడ్లు లేకపోవడం, తాగునీటి సదుపాయం లేకపోవడం వంటి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముందుగా పిల్లలను పాఠశాలకు పంపాలని సూచిస్తూ, “మీకు అవసరమైన సౌకర్యాలన్నింటినీ అందించే బాధ్యత నా దే” అని హామీ ఇచ్చారు.
అవసరమైన మౌలిక వసతులను త్వరలోనే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.
