
వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో, ప్రయాణికులు మరియు స్థానిక ప్రజలకు చల్లని తాగునీరు అందించడం ఎంతో అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని, ప్రజల పట్ల ఉన్న బాధ్యతను ప్రతిబింబిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

చలివేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రతిరోజూ వందలాది మంది దాహాన్ని తీర్చుకునే అవకాశం లభిస్తుందని, ముఖ్యంగా బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిన రవితేజ హాస్పిటల్స్ యాజమాన్యానికి, టీడీపీ యువ నాయకుడు షేక్ మోసిన్‌కు ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
