
మాచర్ల పట్టణంలోని 8వ వార్డులో ఈ రోజు సుడిగాలి పర్యటన నిర్వహించి, స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నాను. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను నేరుగా అడిగి వివరాలు సేకరించాను.
అలాగే, వార్డులో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాను.
