
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ఆరు ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.12.2 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో దేవాలయాల పునర్నిర్మాణం, మండపాల నిర్మాణం, ప్రాంగణాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన చేపట్టనున్నారు.
ఈ అభివృద్ధి పనులు పూర్తయ్యాక భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం, విశ్రాంతి వసతులు లభిస్తాయని అధికారులు తెలిపారు.
నిధులు మంజూరైన దేవాలయాలు:
- శ్రీ సత్రసాల మల్లేశ్వర స్వామి దేవాలయం – జెట్టిపాలెం, రెంటచింతల మండలం
- శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం – రెంటాల, రెంటచింతల మండలం
- శ్రీ సింగరుట్ల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం – పేటసన్నెగండ్ల, కారంపూడి మండలం
- శ్రీ గంగా పార్వతి సమేత భవాని శంకర స్వామి దేవాలయం – సిరిగిరిపాడు, వెల్దుర్తి మండలం
- శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం – మండాది, వెల్దుర్తి మండలం
- శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం – తుమ్రకోట, రెంటచింతల మండలం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భక్తులలో ఆనందాన్ని కలిగించింది.
