
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆజాద్ నగర్ కాలనీ, 28వ వార్డుకు చెందిన మహమ్మద్ రఫీ గత కొంతకాలంగా రెండు కిడ్నీలు దెబ్బతినడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మానసికంగా దిగులుకు గురైనట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో రఫీ మాచర్ల రైల్వే ట్రాక్ సమీపంలోని హైవే కొత్త బ్రిడ్జిపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తన కుమారుడు యూసఫ్కు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న కుమారుడు వెంటనే అక్కడికి చేరుకోగా, బ్రిడ్జిపై ఆటోను ఉంచి కిందకు దూకి ఉన్నట్లు గుర్తించాడు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై వెంకట్రావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
