గురజాల డిఎస్పి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో జిల్లా ఎస్పీ కృష్ణారావు వివరాలు వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గ్యాంగ్ ఏర్పడి, బంగారు ఆభరణాలు తీసుకువెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపారు.
ముఖ్యంగా బంగారు షాపులకు ఆర్డర్లపై ఆభరణాలు సరఫరా చేసే వ్యక్తులను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో 566 గ్రాముల బంగారం దోచుకున్నట్లు చెప్పారు.
ఈ కేసులో ఆరుగురు నిందితులను ప్రత్యేక బృందాలు పేట సన్నిగళ్ల గ్రామం సమీపంలోని ఎన్ఎస్పీ కాలవ కట్ట వద్ద అరెస్టు చేశాయి. నిందితుల వద్ద నుంచి రెండు బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఆరుగురు నిందితులను ప్రత్యేక బృందాలు పేట సన్నిగళ్ల గ్రామం సమీపంలోని ఎన్ఎస్పీ కాలవ కట్ట వద్ద అరెస్టు చేశాయి. నిందితుల వద్ద నుంచి రెండు బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
దోచుకున్న బంగారం మొత్తాన్ని పోలీసులు పూర్తిగా రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పోలీసుల అప్రమత్తతతో గ్యాంగ్ అరెస్ట్ కావడంతో స్థానిక ప్రజలు ఉపశమనం వ్యక్తం చేస్తున్నారు.