
పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో కొండచిలువ సంచారం కలకలం రేపింది. నాయకురాలు నాగమ్మ ధూబచెరువు వద్ద ఉన్న ఇష్టకామేశ్వర స్వామి దేవస్థానం పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
బహిర్భూమికి వెళ్లిన ఓ యువకుడు కొండచిలువ కదలికలను గమనించి వెంటనే స్థానికులకు, పట్టణ పోలీసులకు మరియు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న దైద ఫారెస్ట్ పోలీస్ అధికారి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో స్నేక్ స్నాచర్‌ను పిలిపించి, స్థానికుల సహకారంతో సుమారు గంటపాటు శ్రమించి కొండచిలువను పట్టుకున్నారు.
పట్టుకున్న కొండచిలువను సురక్షితంగా దైద అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని ఫారెస్ట్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు.
