
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని లైబ్రరీ సెంటర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పఠాన్ రాజుబుడే అనే వ్యక్తి మద్యం సేవించి తన భార్య, పిల్లలపై దూషణలకు దిగడంతో వివాదం ప్రారంభమైంది.
అదే సమయంలో సమీపంలో ఉన్న మరో కుటుంబానికి చెందిన మహిళ తననే దూషిస్తున్నాడని భావించి రాజుబుడేతో వాగ్వాదానికి దిగింది.
దీంతో ఆమె తన బంధువులకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న వారు రాజుబుడేపై కర్రలతో దాడి చేసినట్లు సమాచారం.
గొడవ తీవ్రరూపం దాల్చడంతో స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలను విడదీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
దాడిలో తీవ్రంగా గాయపడిన రాజుబుడేను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
