
నరసరావుపేటలో వైసీపీ సోషల్ మీడియా వర్కర్ షేక్ నాగురుబాబు అలియాస్ హన్నుపై జరిగిన దాడి కేసుకు సంబంధించి పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఘటనకు రాజకీయ కోణం లేదని, ఇది పూర్తిగా వ్యక్తిగత వివాదం ఫలితమని డీఎస్పీ ఎం. హనుమంతరావు స్పష్టం చేశారు.
ఎన్ఈసీ కళాశాలలో చదువుతున్న ఓ యువతితో స్నేహం విషయంలో ఇద్దరు యువకుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో హన్నుకు తలకు గాయమై, చికిత్స అనంతరం కోలుకున్నట్లు వెల్లడించారు.
ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఈ ఘటనను రాజకీయ రంగు పులుమడం తగదని, వాస్తవాలను వక్రీకరించకుండా ప్రజలు సహకరించాలని డీఎస్పీ హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.
