
మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణానికి చెందిన భవనాశి రామ్మూర్తి మరణించారు. ఈ విషాద సందర్భంలో పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. రామ్మూర్తి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
