
పలనాడు పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు మాచర్ల నియోజకవర్గ స్థాయిలో పాలిటెక్నిక్ మోడల్ ఎంట్రన్స్ పరీక్షను వికాస్ డిగ్రీ కాలేజీలో నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 170 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ పరీక్షలో సి.హెచ్. వరుణ్ 93 మార్కులతో ప్రథమ స్థానాన్ని సాధించారు. ఆయనకు స్థానిక న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ జున్నా శ్రీనివాసరెడ్డి ప్రకటించిన రూ. 8116 నగదు బహుమతిని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నరసింహారావు, లక్ష్మయ్యల చేతుల మీదుగా అందజేశారు.
జె. చరణ్ తేజ 87 మార్కులతో ద్వితీయ స్థానాన్ని పొందగా, వికాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తరఫున వై. కొండయ్య రూ. 5116 బహుమతిని అందజేశారు.
పి. మహేంద్ర 85 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించగా, శ్రీ విష్ణు జూనియర్ కాలేజ్ తరఫున రూ. 3116 నగదు బహుమతిని కళాశాల డైరెక్టర్ మనోజ్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా పలనాడు ప్రతిభ జూనియర్ కళాశాలల సెక్రటరీ & కరస్పాండెంట్ పఠాన్ నాగూర్ వలి మాట్లాడుతూ, విద్యార్థులు ఇలాంటి పోటీ పరీక్షల ద్వారా లక్ష్యాలను ఏర్పరచుకుని తల్లిదండ్రులు, గురువుల ఆశలను నెరవేర్చాలని సూచించారు.
గణిత అధ్యాపకులు మరియు మోటివేటర్ ఎం.బీ.ఎస్. కోటేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ నిర్వాహకులు మల్లికార్జునరావు, కిషోర్, శ్రీనివాసరావు, మర్రి వెంకట్ నారాయణ పాల్గొని విద్యార్థులను అభినందించారు.
