
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడు విధాని ధర్ దాస్ (46) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఉపాధి కోసం ఒడిశా నుంచి గణపవరం వచ్చిన ఆయన, కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
