
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా భూ సమస్యలు, సివిల్ వివాదాలు నియోజకవర్గంలో అధికంగా ఉన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండల కేంద్రాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజల సమస్యలను తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గత పాలనలో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితుల వల్ల గ్రామాల్లో భూ సమస్యలు ఎక్కువయ్యాయని అన్నారు.
భూ సర్వే సమయంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా ఎమ్మార్వో లేదా ఆర్డీఓలను సంప్రదించాలని సూచించారు. ఇంకా పరిష్కారం కాని అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అన్ని శాఖల అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
