
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
నాదెండ్ల భాస్కర్‌రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా కొనసాగుతున్నారు.
