
నకరికల్లు మండలం గుండ్లపల్లికి చెందిన దివ్యాంగుడు అల్లానబి, బ్యాక్‌లాగ్ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే క్రమంలో 5వ తరగతి మార్కుల జాబితా అవసరమైంది.
ఈ నేపథ్యంలో తాను చదివిన పాఠశాల సంబంధిత అధికారిని సంప్రదించగా, సర్టిఫికెట్ జారీ చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించారు. లంచం ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తానని చెప్పడంతో నిరాశ చెందిన ఆయన, మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.
