
మాచర్ల టౌన్ 8వ వార్డు రోప్ లైన్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థి ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కొన్నేళ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి, భారీగా డబ్బులు పోగొట్టుకున్నట్లు సమాచారం. ఇటీవల తన తల్లి బ్యాంక్ ఖాతాలో ఉన్న సుమారు రూ.3 లక్షలను కూడా బెట్టింగ్‌లలో ఖర్చు చేసినట్లు తెలిసింది
తల్లి మల్లేశ్వరి మరో కుమారుడితో కలిసి బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేకపోవడం గమనించారు. ఈ విషయంపై చిన్న కుమారుడిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో వంశీని తల్లి నిలదీయగా, అతను రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు మాచర్ల పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
