
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలు అపారమని కొనియాడారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఆయన దూరదృష్టి, కృషి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ప్రజల సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల పెంపులో ఆయన పాత్ర ప్రత్యేకమని అన్నారు.
అలాగే, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
