
అగ్నిమాపక అధికారులకు సన్మానం
మాచర్ల :
అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా ఆదివారం వాసవి క్లబ్ మాచర్ల చెన్నకేశవ నిర్వాహుకులు 12 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు వాసవిక్లబ్ రీజియన్ చైర్మన్ ఓరుగంటి చెన్నకేశవరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ మదార్ సాహెబ్ మాట్లాడుతూ అగ్నిమాపక అధికారులు, సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి వాసవి క్లబ్ నిర్వాహుకులు సన్మానించటం అభినందనీయమన్నారు. ప్రమాదాలు చెప్పిరావని, ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిగా సంఘటన స్థలానికి చేరుకొని తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ప్రాణ, ఆస్థిని కాపాడుతారని, వారి సేవలు వెలగట్టలేనివని పేర్కొన్నారు. అగ్నిమాపక ఇంచార్జి అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని పలు ఆపార్ట్ మెంట్లు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అగ్నిప్రమాదాలుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగినప్ప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అసీస్టెంట్ గవర్నర్ మేడం నాగేశ్వరరావు, సభ్యులు భవనాశి రవితేజ, కొత్తూరి చందు, అల్లం కోటిరెడ్డి, ఫైర్ హుస్సేన్ , ఫైర్ మెన్ లు నాగిరెడ్డి, బాలకృష్ణ, రాజశేఖర్ ,వీరాంజనేయులు, వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.
