
మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా తెలుగు యువత నాయకులు షేక్ మోసిన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
రాయవరం జంక్షన్ వద్ద ఉన్న మదరసా పిల్లలకు దుప్పట్లు, నిత్యావసర వస్తువులు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే లింగాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పలకలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పఠాన్ బద్రుద్దీన్, ముటుకూరు సుభాని, చింతపల్లి ముజఫర్, బట్టల మౌలాలి, టీ షరీఫ్, టోపీ సుభాని, అలీ, మార్బుల్ ఖలీల్, అబ్బాస్ షరీఫ్, ఖాసీం, స్టూడియో మస్తాన్, షన్వాజ్, రియాజ్, బుల్లెద్దుల శివ, స్టూడియో మస్తాన్ సందీప్, బ్రహ్మం ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
