
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పోలేపల్లి గ్రామానికి చెందిన బాలబోయిన శంకర్ (50) స్నేహితుడి పొలంలో బోరు మోటార్‌ను సరిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

షాక్ తగిలిన అనంతరం వైర్లు పడిపోవడంతో మృతదేహం తీవ్రంగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
