
చక్రధర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల వీడ్కోలు సభను పురస్కరించుకుని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్యూ) ఆధ్వర్యంలో పీజీ అడ్మిషన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ ఆర్‌వీఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్ (OSD, ఏఎన్యూ) మాట్లాడుతూ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు యూనివర్సిటీలో చదివే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

భారతదేశంలోని టాప్ 100 యూనివర్సిటీలలో, ప్రపంచ టాప్ 500లో ఏఎన్యూ స్థానం సాధించిందని ఆయన తెలిపారు. పీజీ కోర్సులలో అడ్మిషన్స్‌కు ఏఎన్యూ పూర్తిగా సిద్ధంగా ఉందని ప్రొఫెసర్ వి. దివ్య తేజ మూర్తి వెల్లడించారు. ఈ సందర్భంగా పీజీ అడ్మిషన్స్‌కు సంబంధించిన గోడపత్రాలు, కరపత్రాలను విడుదల చేసి, విద్యార్థులకు అడ్మిషన్ ప్రక్రియపై సమగ్ర వివరాలు అందించారు.

సినీ నిర్మాత, హీరో డాక్టర్ శశికుమార్ మాట్లాడుతూ, అవకాశాలు ఎవరు ఇవ్వరు, మనమే సాధించుకోవాలని, ప్రతి విద్యార్థి స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ గాలయ్య, డాక్టర్ కె. శశిధర్, ప్రిన్సిపాల్ కె. సాయిమార్ కొండారెడ్డి, డైరెక్టర్ ఎం. మహేశ్వర్ రెడ్డి, సైకం శివారెడ్డి, జై గురవయ్య, ఎన్‌ఎఫ్‌ఎస్ రాణి, లక్ష్మీ ప్రసన్న, రాజ్యలక్ష్మి, బరువు రోశి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
