
రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న వేసవి తీవ్రత దృష్ట్యా చిన్నారుల ఆరోగ్యం, భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడి విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కేంద్రాలు పనిచేయనున్నాయి. పని వేళల్లో మార్పులు వచ్చినప్పటికీ, లబ్ధిదారులకు అందించే పోషకాహార పంపిణీలో ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అలాగే టేక్ హోం రేషన్ (THR) విధానాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అంగన్వాడీల్లో ఒంటిపూట బడి విధానం కొనసాగనుంది.
