
కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులో అరెస్ట్ అయి, అనంతరం బెయిల్‌పై విడుదలైన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, యర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఈరోజు తాడేపల్లిలోని నివాసంలో పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
పార్టీని మరింత బలోపేతం చేయడం, కేడర్‌కు భరోసా కల్పించడం దిశగా నాయకత్వం నుంచి మార్గదర్శకాలు పొందినట్లు తెలిసింది
