
దాచేపల్లి నగర పంచాయతీకి సంబంధించిన విద్యుత్ బకాయిల విషయంలో విద్యుత్ శాఖ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. పట్టణంలోని వాటర్ వర్క్స్, వీధి దీపాలకు సంబంధించిన సుమారు రూ.7 కోట్లు 19 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉందని మంగళవారం నగర పంచాయతీ కమిషనర్‌కు నోటీసులు అందజేశారు.
ఈ నేపథ్యంలో నగర పంచాయతీ అధికారులు విద్యుత్ శాఖతో చర్చలు జరిపి, బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని అంగీకరించినట్లు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ వీరేశ్వరరావు, ఏఏఓ సందీప్ కుమార్, జేఏఓ ఆశీర్వాదం, ఏఈలు భగవాన్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
