
పల్నాడు జిల్లా దుర్గి మండల కేంద్రంలో మంగళవారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వేణుగోపాల్ స్వామి వారి దేవస్థానం సెంటర్‌లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో, తహసీల్దార్ వరకుమార్ ఆదేశాల మేరకు వీఆర్వో వెంకటేశ్వర్లు సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రభుత్వం ఇటీవల చేపట్టిన భూ సర్వేలో భాగంగా సుమారు 200 మంది రైతులకు కొత్తగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టినదని తహసీల్దార్ వరకుమార్ తెలిపారు. దశలవారీగా మరిన్ని పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
రైతుల సూచనల మేరకు ముందస్తు సర్వే నిర్వహించి, ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించిన తర్వాతే ఈ పాస్ పుస్తకాలను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
