
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మిట్టగోడుపాడు అడ్డ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
గురజాల నుండి మాచర్ల వైపు వెళ్తున్న కారు, ఎర్రబాలెం నుండి హైవేపైకి స్కూటీతో వస్తున్న మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జెట్టిపాలెం గ్రామానికి చెందిన పల్లెర్ల జ్యోతి తీవ్రంగా గాయపడి ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఢీకొన్న ప్రభావంతో స్కూటీ సుమారు 100 మీటర్ల దూరం ఎగిరి పడినట్లు సమాచారం.

సంఘటన విషయం తెలుసుకున్న గురజాల డీఎస్పీ వెంకటరమణ, రెంటచింతల ఎస్సై నాగార్జున ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బ్యాంకు పనుల నిమిత్తం వచ్చిన జ్యోతి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు

మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
