
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం ఈసీ మెంబర్, ఏపీయూడబ్ల్యూజే మాచర్ల నియోజకవర్గ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కారంపూడి సముద్రాల పవన్ సాయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, జర్నలిస్టులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సముద్రాల పవన్ సాయి జర్నలిజం రంగంలో కృషి చేస్తూనే సామాజిక సేవలోనూ ముందంజలో నిలుస్తున్నారని కొనియాడారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే రిపోర్టర్‌గా తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ, సంఘ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి, తన సేవా కార్యక్రమాలను విస్తరించి, జర్నలిజం రంగంలో మరింత ప్రతిష్ఠను సంపాదించాలని ఆకాంక్షించారు. అలాగే సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ, అందరి మన్ననలు పొందాలని ఆశీర్వదిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, యువజన నాయకులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
