
పల్నాడు జిల్లా దుర్గి మండలం అడి గొప్పుల శివారు నిదానంపాడు గ్రామంలో వెలసిన శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తులు కిటకిటలాడారు. పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, నైవేద్యాలు సమర్పించి, చండీ హోమం సహా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య “భక్తులను చల్లగా చూడమ్మా.. కోరికలు తీర్చమ్మా” అంటూ ఆశీర్వచనాలు అందించారు.

పల్లకిలో ఊరేగిన అమ్మవారు
సాయంత్రం నందీశ్వరుని సమక్షంలో శ్రీలక్ష్మి అమ్మవారిని పల్లకిలో అలంకరించి, బ్యాండ్ మేళాలు, బాజా భజంత్రాలతో గుడి చుట్టూ ఘనంగా ఊరేగించారు. ఈ ఉత్సవం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది.
🟥 తలనీలాలు సమర్పించిన భక్తులు – అన్నదానం
కొంతమంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ రోజు ప్రత్యేకంగా ఆలయ శాశ్వత ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు స్వయంగా అమ్మవారి పల్లకిని మోసి భక్తులకు ఆదర్శంగా నిలిచారు.
🟥 భక్తులకు సకల సౌకర్యాలు
భక్తుల సౌకర్యార్థం లడ్డూలు, దర్శన టిక్కెట్లు, భోజన ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టినట్లు దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్, కార్యనిర్వాహక అధికారి కాకర్ల అదిశేషనాయుడు తెలిపారు.
