
రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో దుర్గి మార్కెట్ యార్డ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పలు సంక్షేమ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.
పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి, పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. పశువులకు మెరుగైన వైద్యసేవలు అందించడం ద్వారా రైతుల ఆదాయం పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.
రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించి పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు, పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
