
మాచర్ల పట్టణ ఆర్యవైశ్య మరియు యువజన మహిళా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న గరిణే శ్రీనివాస్ రావుకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
మాచర్ల పట్టణ టిడిపి నాయకులు యెనుముల కేశవరెడ్డి మాట్లాడుతూ, గరిణే శ్రీనివాస్ రావు నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సమాజ సేవలో ఆయన చూపిస్తున్న నిబద్ధత అభినందనీయమని పేర్కొన్నారు.

అలాగే మాచర్ల, దుర్గి డాల్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిపాటి శేషు మాట్లాడుతూ, కొత్త కార్యవర్గం సమన్వయంతో పనిచేసి ఆర్యవైశ్య సమాజానికి మరింత సేవ చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా సంఘ సభ్యులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

