
మాచర్ల పట్టణంలోని నూర్ మసీద్, మర్కస్ మసీద్‌లలో నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు కూడా హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు

ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నెలరోజులపాటు నిష్టతో ఉపవాస దీక్షలు ఆచరించి పేదలకు సహాయం చేయడం ముస్లింల గొప్ప సంప్రదాయమని అన్నారు. రంజాన్ నెల సౌహార్ద్రం, సహనానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించడంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం పెద్దలు, యువకులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
